హాలీవుడ్‌లో రీమేక్ అవుతోన్న దృశ్యం

Drishyam Movie Set For English Language Remake in Hollywood

భారతీయ సినిమాలకు ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. దేశీయ మూలాల నేపథ్యంతో రూపొందిన కథలు విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. మేకర్స్ సైతం కొత్త తరహా కథలతో మూవీలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ప్రఖ్యాత ‘ఆస్కార్‌’ పురస్కారాన్ని సైతం అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక భారతీయ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘దృశ్యం’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా సమాచారం ప్రకారం.. ‘దృశ్యం’ మూవీ హాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ గల్ఫ్‌ స్ట్రీమ్‌ పిక్చర్స్‌.. మరో భాగస్వామి జేఓఏటీ ఫిల్మ్స్ తో కలిసి ‘దృశ్యం’ రెండు భాగాలను ఇంగ్లీష్ భాషలో నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సదరు నిర్మాణ సంస్థ ఇండియన్‌ ప్రొడక్షన్ హౌస్ పనోరమ స్టూడియోస్‌ నుంచి ఈ కథల రీమేక్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లీష్ వెర్షన్‌లో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

కాగా 2013లో తొలుత మలయాళంలో రిలీజైన దృశ్యం మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్‌-మీనా, తమిళంలో కమల్ హాసన్-గౌతమి, కన్నడలో రవిచంద్రన్-నవ్య నాయర్, హిందీలో అజయ్ దేవగణ్-శ్రీయ జంటగా రీమేక్‌ చేయగా.. అన్ని భాషల్లో సంచలన విజయం అందుకుంది. అలాగే ఈ కథకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం-2’ కూడా పలు భాషల్లో రీమేక్ చేసుకుని సక్సెస్ అందుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.