దేవకీ నందన వాసుదేవ- సోల్ ఫుల్ ఏమయ్యిందే సాంగ్ రిలీజ్

Devaki Nandana Vasudeva first single yeamayyinde full song out now

అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. యాక్షన్ కట్ తో ఉన్న గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాట ప్రోమోన రిలీజ్ చేసి చాలా రోజులైంది. కానీ ఇంతవరకూ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయలేదు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా ఉన్న ఈ పాట అయితే ఆకట్టుకుంటుంది. సురేష్ గంగుల లిరిక్స్ అందించిన ఈపాటను ఈశ్వర్ దత్తు ఆలపించాడు.

కాగా ఈసినిమాను జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్‌ వర్మ కథను అందిస్తున్నాడు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − two =