ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ -ఆపరేషన్ సక్సెస్ 

Operation Valentine movie telugu review

నటీనటులు : వరుణ్ తేజ్,మానుషి చిల్లర్,రుహాణి శర్మ,నవదీప్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : హరి కే వేదాంతం
సంగీతం : మిక్కీ జె మేయర్
దర్శకత్వం : శక్తి ప్రతాప్ సింగ్
నిర్మాణం : సోనీ పిక్చర్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో మెగా హీరో వరుణ్ తేజ్ ఒకరు.ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడు ముందుటాడు ఈ హీరో.ఈసారి కూడా మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అదే ఆపరేషన్ వాలెంటైన్.ఇందులో వరుణ్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా నటించాడు.ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి.మరి ఈసినిమా ఎలా వుంది.వరుణ్ కు కావల్సిన హిట్ ఇచ్చిందా లేదా ఇప్పుడు చూద్దాం.

కథ :

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సంఘటనలను ఆధారంగా చేసుకొని కథ రాసుకున్నాడు దర్శకుడు.అర్జున్ (వరుణ్ తేజ్ )భారత వైమానిక దళంలో కమాండర్.తన టీం తో కలిసి పుల్వామా ఎటాక్ కు పాకిస్థాన్ పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఈసినిమా కథ.

విశ్లేషణ : 

కథ ముందే తెలిసినా స్టోరీ ని నడిపించిన విధానంలోనే సినిమాలు విజయవంతమవుతాయి.ఈవిషయంలో ఆపరేషన్ వాలెంటైన్  డైరెక్టర్ ఎక్కడా నిరాశపరచలేదు.తను చెప్పాలనుకున్నది 2గంటల్లో ఎక్కడా డైవర్షన్ లేకుండా చెప్పేశాడు.దానికి తోడు పర్ఫెక్ట్ క్యాస్టింగ్,టెక్నికల్ సపోర్ట్ ఉండడంతో ఆపరేషన్ వాలెంటైన్ ఆకట్టుకుంది.ఫస్ట్ హాఫ్ లో లీడ్ పెయిర్ కు సంబందించిన గతాన్ని చూపించగా కథ అంతా సెకండ్ హాఫ్ లో రివీల్ చేశారు.ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి.అలాగే ఎక్కడా ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు.ప్రీ క్లైమ్యాక్స్ ,క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు గూస్ బాంబ్స్ తెప్పిస్తాయి.ఓవరాల్ గా ఈ ఆపరేషన్ వాలెంటైన్ మెప్పిస్తుంది.

నటీనటులవిషయానికి వస్తే వరుణ్ తేజ్ నటన సినిమాకు హైలెట్ అయ్యింది.తన కటౌట్ కి వైమానిక దళ కమాండర్ పాత్ర బాగా సూట్ కావడంతో ఆపాత్రలో జీవించేశాడు.ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బాగా చేశాడు.హీరోయిన్ గా నటించిన మానుషి చిల్లర్ ఆకట్టుకుంది.గ్లామర్ అవసరం లేని పాత్రలో తన నటనతో మెప్పించింది.ఇక మిగితా కీలక పాత్రల్లో నటించిన రుహాణి శర్మ ,నవదీప్ తమ పాత్రలకు ఏం కావాలో అది ఇచ్చారు.

టెక్నికల్ గా సినిమా బ్రిలియంట్ అనిపించింది.ముఖ్యంగా విజువల్స్ వావ్ అనిపించాయి.లిమిటెడ్ బడ్జెట్ లో అద్బుతమైన విజువల్స్ అందించాడు కెమెరామెన్.అలాగే మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది.నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్ గా వుంది.నిర్మాణం చాలా రిచ్ గా వుంది.మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా ఆపరేషన్ వాలైంటైన్ ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది.వరుణ్ తేజ్ నటన ,విజువల్స్ ,ప్రీ క్లైమ్యాక్స్ ,క్లైమ్యాక్స్ ,డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి.వార్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ ఆపరేషన్ వాలెంటైన్ బాగా నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =