మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అది కూడా ఏ సినిమా పడితే ఆసినిమా కాదు. కథా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ హిట్లు కూడా అందుకుంటున్నాాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు భ్రమయుగం. ఈసినిమా అప్ డేట్లతోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. హార్రర్ థిల్లర్ నేపథ్యంలో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ తో ఈసినిమా ను తెరకెక్కించారు. ఈసినిమా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ హిట్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు వేరే భాషల్లో రిలీజ్ అయిన సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు సొంతం చేసుకోగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
We are extremely happy to announce that we will be releasing the recent blockbuster of Legendary actor, our @mammukka‘s #Bramayugam (Telugu) in AP & TS💥
Come dwell into a never-before horror experience from 23rd February at a theatre near you.🔥… pic.twitter.com/Nxqfa3dmNx
— Sithara Entertainments (@SitharaEnts) February 19, 2024
కాగా రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ఇంకా అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నైట్ షిఫ్ట్ స్డూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా, సంగీతం క్రిష్టో జేవియర్, షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: