మాలీవుడ్ విలక్షణ నటుడు పహద్ ఫాజిల్ ‘పుష్ప’ మరియు అనేక డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆవేశం’. గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా కథాంశంతో ‘రోమాంచం’ ఫేమ్ జీతూ మాధవన్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫహాద్ ఫాజిల్ కెరీర్లో వంద కోట్ల వసూళ్లను రాబట్టిన ఫస్ట్ మూవీగా రికార్డ్ నెలకొల్పింది. అలాగే ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘ప్రేమలు’, ‘ది గోట్ లైఫ్’ సినిమాల తర్వాత ‘ఆవేశం’ నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆడియెన్స్‌కు థ్రిల్‌ను అందించే కథకు దర్శకుడి అద్భుతమైన టేకింగ్ ఈ సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. దీనికితోడు ఫహాద్ ఫాజిల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. రంగా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. అంతగా ఆయన ఆ క్యారక్టర్లో చెలరేగి నటించారు. అలాగే ఇందులో కీలక పాత్రలు పోషించిన ఇతర నటులు కూడా సహజ నటనతో ఆకట్టుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న ఆవేశం తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మే 9న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కాగా థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం.
కాగా ఈ సినిమాలో ఆశిష్ విద్యార్ధి, సాజిన్ గోపు, రోషన్శాన్వాజ్, మిథున్ జైశంకర్, మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఫహాద్ ఫాజిల్ సతీమణి, హీరోయిన్ నజ్రియా మరియు అన్వర్ రషీద్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు అదిరిపోయే లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఇటీవలే మలయాళం సహా వివిధ భాషల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిన్న సినిమా ‘ప్రేమలు’ని కూడా ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: