ధనుష్ 50 మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

dhanush 50th movie first look out now

తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ తన సత్తా చూపిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా కాకుండా ధనుష్ తన స్వీయ దర్శకత్వంలోనే మరొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇది ధనుష్ 50 వ సినిమా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన సంగతి కూడా విదితమే. ఈ కథ నార్త్ చెన్నైకి సంబంధించిన ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈసినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఈసినిమాకు రాయన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. కాగా ఈసినిమాను తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =