నటుడిగా 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న రానా

Rana Daggubati First Movie Leader Completed 14 Years

‘బాహుబలి’లో భల్లాలదేవుడిగా ప్రతినాయక పాత్రలో కౄరత్వం ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి నటుడిగా 14 వసంతాలు పూర్తిచేసుకున్నారు. కాగా రానా, ఇండియన్ మూవీ మొఘల్, దివంగత దిగ్గజ నిర్మాత రామానాయుడు మనవడు అన్న విషయం తెలిసిందే. రామానాయుడు పెద్ద కుమారుడు, స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడైన రానా.. బాబాయి విక్టరీ వెంకటేష్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆయన నటించిన మొదటి సినిమా ‘లీడర్’ నేటితో 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లీడర్’ చిత్రం 2010 ఫిబ్రవరి 19న విడుదలైంది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో రాజకీయ నాయకుల అవినీతి, పదవీ కాంక్షల చుట్టూ కథ నడుస్తుంది. హఠాత్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించడం, అనుకోని పరిస్థితుల్లో కథానాయకుడు సీఎం పదవిని చేపట్టడం, నిజాయితీగా పనిచేయాలనుకున్న అతనికి ఎదురయ్యే ఆటంకాలు, పరిణామాలు కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే రానాకు ఇది తొలి సినిమానే అయినా.. ఎంతో సహజంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి మిశ్రమ ఫలితం వచ్చినా నటుడిగా రానాకు ఎన్నో అవకాశాలు రావడానికి కారణమైంది.

ఇక ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో సైతం నటించారు. ఈ క్రమంలో ఆయన హిందీ, తమిళం, కన్నడ తదితర భాషా చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఆయన కేవలం నటుడిగానే కాకుండా పలు చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా మంచి కథలతో, కొత్తవారు నటించే సినిమాలను తన సొంత బ్యానర్ పై రిలీజ్ చేస్తూ వారికి సహకారం అందిస్తున్నారు. ‘C/o కంచరపాలెం’, ‘కీడకోలా’ వంటి చిత్రాలు రానా సమర్పించినవే.

ఇక రానా హీరోగానే కాకుండా మల్టీ స్టారర్ చిత్రాలలో సైతం నటిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా రానా ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ‘రాక్ష‌స‌రాజా’ అనే గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వీరి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘నేను రాజు నేనే మంత్రి’ సినిమా సాలిడ్ హిట్ అనిపించుకుంది. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కానుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనితోపాటుగా కోలీవుడ్ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా చేస్తోన్న ‘వేట‌గాడు’లో ఆయన కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు.

అలాగే క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న పౌరాణిక సినిమా ‘హిర‌ణ్య‌క‌శ్య‌ప’లో హీరోగా చేస్తున్నారు. ఇందులో పురాణ పాత్ర హిరణ్యకశిపుడిగా టైటిల్ పాత్రలో నటించనున్నారు. కాగా ఈ సినిమాలన్నీ పాన్ ఇండియ‌న్ మూవీలుగా రూపొందుతుండటం విశేషం. ఇక నటుడిగా 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న రానా.. భవిష్యత్తులో మరిన్ని గొప్ప చిత్రాలలో నటించాలని, తద్వారా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, తెలుగు ఫిల్మ్ నగర్ తరపున ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =