టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ ‘ఏదో ఏదో మాయ’ ప్రేక్షకులను అలరించడంతో పాటు అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘భీమా’ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన గోపీచంద్ శనివారం (ఫిబ్రవరి 17, 2024) కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గోపీచంద్.. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: