బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన అల్లు అర్జున్

Icon Star Allu Arjun Shines with Traditional Black Kurta in Berlin Film Festival

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు అరుదైన గౌరవం లభించింది. జర్మనీ వేదికగా జరిగే బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియా ప్ర‌తినిధిగా అల్లు అర్జున్‌  పాల్గొన్నారు. ఇక ఈ ఫెస్టివల్‌లో ఆయన నటించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరగడం విశేషం. కాగా ఇప్పటికే రష్యా, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా మరియు యూకే తదితర దేశాల్లో విశేష ఆదరణ దక్కించుకున్న పుష్ప సినిమా.. ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా స్క్రీనింగ్ జరుపుకోవడం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఈవెంట్ నేపథ్యంలో అల్లు అర్జున్ అంతర్జాతీయ ప్రెస్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ రెడ్ కార్పెట్‌పై తళుక్కుమన్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన అల్లు అర్జున్.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. నలుపు రంగు కుర్తాలో మెరిసిన ఆయన గ్లోబల్ స్టేజ్‌లో తనదైన మ్యాన్లీ లుక్‌లో స్పాట్‌లైట్‌ను అట్రాక్ట్ చేశారు. తద్వారా అల్లు అర్జున్ ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ఇమేజ్‌ని మరింతగా ఇనుమడింపజేశారు. ఇక ఇదిలా ఉండగా.. పుష్ప మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘పుష్ప 2: ది రూల్’ ఆగ‌స్ట్ 15న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. దీనిపై ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ సర్కిల్స్‌లోనూ విపరీతమైన బజ్ నెలకొంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + seventeen =