ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి నమ్మకాన్ని ఏర్పరుచుకుంది. దానికి తోడు ప్రీమియర్ షోలకు కూడా మంచి టాక్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కేవలం ప్రీమియర్ షో లకే రూ కోటి రూపాయల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు మంచి రివ్యూసే వచ్చాయి. చాలా కాలం తరువాత సందీప్ కిషన్ కు ఈసినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. ఇక ఈసినిమా ఫస్ట్ కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. మొదటి రోజు ఈసినిమా 6కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరి ఈ గ్యాప్ లో రిలీజ్ కు పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఈసినిమాకు అది కలిసొచ్చే అంశమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
So Indebted to your Love & Affection♥️
నా మీద ప్రయోగించబడిన అస్త్రాలన్నిటిని దాటించి ఇది మీరు నాకు అందించిన విజయం, నా ప్రాణం అడ్డేసైన సరే, నా కష్టంతో మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పటికి నిలబెట్టుకుంటాను 🙏🏽
#OoruPeruBhairavaKona pic.twitter.com/YPDoITSZzo
— Sundeep Kishan (@sundeepkishan) February 17, 2024
ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: