టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మూవీ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో గానే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. మహేష్ యాక్టింగ్, డైలాగ్ స్లాంగ్, డ్యాన్స్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ఈ సినిమాతో మహేష్ బాబు పలు రికార్డులు బద్దలు కొడుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. తాజాగా హీరో మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని గుంటూరు కారం చిత్రంలోని ఒక పాటకు డ్యాన్స్ చేసింది. సినిమాలోని ‘ధమ్ మసాలా’ సాంగ్కు సితార ఎంతో గ్రేస్తో స్టెప్పులేయడం విశేషం. ఇది చూసిన సూపర్ స్టార్ అభిమానులు తమ అభిమాన హీరో తనయ, ఏకంగా ఇలా తండ్రి పాటకే డ్యాన్స్ చేయడం చూసి మురిసిపోతున్నారు. సితార అదిరిపోయే స్టెప్పులేసిందని, అది కూడా సినిమాలో మాదిరే స్టెప్పులేసిందని సంబరపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ పాట గుంటూరు కారం మూవీలో కూడా మాంచి మాస్ బీట్గా నిలిచిన విషయం తెలిసిందే.
View this post on Instagram
కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. అలాగే జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్కు ముందే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ అనిపించుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: