సినీ రంగానికి, రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సినీ నటులు రాజకీయాల్లో కూడా సేవలు అందించారు. అయితే వారి తరువాత అందరూ ఆసక్తిగా ఎదురుచూసింది తలైవా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి. అయితే రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తన అరోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలాఉండగా గత కొద్ది కాలంగా మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు దళపతి విజయ్. అయితే తాజాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. ఈరోజు విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఈ పార్టీ పేరుని కూడా చెప్పేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. పార్టీ జెండా, అజెండాను త్వరలో తెలియచేస్తామని.. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని పోస్ట్ లో పేర్కొన్నారు.
#தமிழகவெற்றிகழகம் #TVKVijay https://t.co/Szf7Kdnyvr
— Vijay (@actorvijay) February 2, 2024
దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: