ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఓటిటి లోకి వచ్చేస్తుంది.పొంగల్ కు విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తో 50కోట్ల వరకు రాబట్టుకుంది.ఇక అదే రోజు ఈసినిమా తెలుగులోకూడా విడుదలకావాలి కానీ పోటీ ఎందుకని వెనక్కి తగ్గి గత వారం విడుదలైంది.ఇక ఇప్పుడు ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈనెల 9న తెలుగు తోపాటు తమిళ ,కన్నడ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రైమ్ ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ప్రముఖ కన్నడ నటుడు శివ రాజకుమార్ కీలక పాత్రలో కనిపించాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది.
ఇక ప్రస్తుతం ధనుష్ ,శేఖర్ కమ్ముల తో సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఏషియన్ సునీల్ ,పుస్కూరు రామ్ మోహన్ నిర్మిస్తున్నారు.ఈఏడాది ద్వితీయార్ధంలో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: