మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడితో సీతారామం సినిమా చేయగా ఆ సినిమా సంచలన విజయాన్ని అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ ను రేపు అంటే ఫిబ్రవరి3వ తేదీన సాయంత్రం 4 గంటల 41నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A first step into the remarkable journey of #LuckyBaskhar, begins tomorrow at 04:41pm! 🤩#LuckyBaskharFirstLook ✨#LuckyBaskhar @dulQuer #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/KgWZN4fOBI
— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2024
కాగా ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: