టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. తొలినుంచీ భిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలలో నటిస్తూ క్రమంగా తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ చూసి స్టార్స్ కూడా ఆశ్చర్యపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది ‘కార్తికేయ 2’ చిత్రంతో బాలీవుడ్ సహా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆయన గత చిత్రం ‘స్పై’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్ రాబట్టడం గమనార్హం. మరో రెండు సాలిడ్ హిట్లు పడితే నిఖిల్ అగ్ర హీరోల లిస్టులో చేరిపోతాడని సినీ ఎనలిస్టుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో తాజాగా నిఖిల్ ఒక గుడ్ న్యూస్ షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అది తన సినిమాలకు సంబంధించినది కాదు. అదేంటంటే..? ఆయన అతి త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ మేరకు నిఖిల్.. తన భార్య పల్లవి శ్రీమంతపు వేడుక ఫొటోని షేర్ చేశారు. ఈ సందర్భంగా.. ‘‘సీమంతం .. బేబీ షవర్ యొక్క సాంప్రదాయ భారతీయ రూపం. అతి త్వరలో మేము మా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ శుభ సందర్భంలో మాకు మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. నిఖిల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2020లో కరోనా కాలంలో వృత్తి రీత్యా డాక్టర్ అయిన పల్లవిని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024
కాగా నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాకు రవి బస్రూర్, రామకృష్ణ పరమహంస వంటి స్టార్ టెక్నిషన్‌లు పనిచేస్తున్నారు. అలాగే నిఖిల్ సరసన టాలీవుడ్ లక్కి గర్ల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘స్వయంభూ’ సినిమాను పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ మరియు శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు నిఖిల్ ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా ‘ది ఇండియన్ హౌజ్’ అనే ఓ భారీ పాన్ ఇండియా సినిమాను ప్రకటించగా, ‘కార్తికేయ’ సిరీస్‌లో భాగంగా మూడో పార్ట్ కూడా చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్‌డ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: