ఆపరేషన్ వాలెంటైన్‌ రిలీజ్‌ రీషెడ్యూల్‌.. కొత్త తేదీ ఎప్పుడంటే?

Varun Tej's Operation Valentine Release Date Rescheduled

టాలీవుడ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ది ప్రత్యేక శైలి. కమర్షియల్‌ పంథాలో వైవిధ్యమైన కథాంశాలతో భిన్నమైన నేపథ్యాలు కలిగిన సినిమాలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ఇదే క్రమంలో తాజాగా వరుణ్‌ తేజ్‌ నటించిన మరో చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్‌’. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం) బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీకి యాడ్ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆపరేషన్ వాలెంటైన్‌ చిత్రం విడుదల వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 16న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. తాజా అప్‌డేట్ ప్రకారం చిత్రబృందం దీనిని రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆపరేషన్ వాలెంటైన్‌.. ఫిబ్రవరి 23న కానీ, లేదా మార్చి 1న కానీ ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం. కాగా దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కాగా ఆప‌రేష‌న్ వాలెంటైన్‌ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. తెలుగుతోపాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =