మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో వివాహం అనంతరం నటి లావణ్య త్రిపాఠి పేరు తెలుగునాట మారుమ్రోగిపోయింది. వీరి వివాహం గతేడాది నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘మిస్ పర్‌ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 2న హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ మంగళవారంనాడు ‘మిస్ పర్‌ఫెక్ట్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె విలేఖరులతో ముచ్చటించింది. ఈ క్రమంలో వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్.. వివాహానికి ముందు హీరోయిన్ లావణ్య త్రిపాఠి అని పిలిచేవారని, అయితే ఇప్పుడు మెగా కోడలు అనే ట్యాగ్ వచ్చిందని, రెండింటిలో మీకు ఏది నచ్చింది? అని అడిగారు. దీనికి లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. నటి అనేది నాకు నేనుగా సంపాదించుకున్నది. నా స్వయంకృషితో గుర్తింపు పొందాను. అయితే ‘మెగా కోడలు’ అనేది చాలా ప్రత్యేకమైనది. అది వివాహంతో ఏర్పడిన బంధుత్వం. దానిని చాలా గౌరవిస్తాను. ఎందుకంటే.. భవిష్యత్తులో ‘మెగా కోడలు’ అనే ట్యాగ్ నాకు చాలా చాలా స్పెషల్ కానుంది” అని పేర్కొన్నారు.
అలాగే రియల్ లైఫ్‌లో తన కన్నా వరుణ్ తేజ్ పర్‌ఫెక్ట్ అని తెలిపారు లావణ్య త్రిపాఠి. చాలా విషయాల్లో వరుణ్ తన కంటే బెస్ట్ అని చెప్పారు. ఇక తన తల్లిదండ్రులు తన సినిమా ఎంపికలపై ఎప్పుడూ ఆంక్షలు విధించలేదని, తన భర్త వరుణ్ తేజ్ కూడా గౌరవిస్తారని ఆమె అన్నారు. కాగా వివాహానికి ముందు వరుణ్ తేజ్, తాను కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో నటించామని గుర్తు చేసిన లావణ్య.. భవిష్యత్తులో మంచి స్టోరీ వస్తే ఇద్దరం మళ్ళీ కలిసి నటించడానికి సిద్ధమని అన్నారు. అయితే అనుకోకుండా తామిద్దరం నటించిన చిత్రాలు ఫిబ్రవరిలో రిలీజ్ కానుండటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఆమె తెలిపారు.
కాగా వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘ఆపరేషన్ వేలంటైన్’ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలకానుంది. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. అలాగే కరుణ కుమార్ దర్శత్వంలో ‘మట్కా’ అనే మరో పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: