అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్ రిలీజ్..లవ్ ప్లస్ ఎమోషన్

ambajipeta marriage band movie trailer out now

దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.ఈసినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ముందు లవ్ యాంగిల్ ను చూపించగా ఆతరువాత సీరియస్ మోడ్ ను చూపించారు. ట్రైలర్ ను బట్టి కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సుహాస్ మరో హిట్ ను కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు అప్పుడే మొదలయ్యాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + nineteen =