పుష్ప 2- 15 దేశాల్లో పుష్ప సాంగ్ టాప్ ట్రెండింగ్

pushpa2 first sigle top trennding in 15 countries

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఆగష్ట్ 15 తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈదిశగా త్వరలోనే షూటింగ్ ను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ఇప్పటికే చూశాం. ఫస్ట్ లుక్ దగ్గర నుండి ఇటీవల బన్నీ పుట్టినరోజున రిలీజ్ చేసిన టీజర్ వరకూ అన్నీ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను మే 1వ తేదీన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. పుష్ప పుష్ప అంటూ వచ్చే ఈపాట మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. పాట, అందులో అల్లు అర్జున్ స్టెప్పులు అందరికీ తెగ నచ్చేశాయి. అందుకే పాట రిలీజ్ అయి రెండు రోజులు అవుతున్నా సోషల్ మీడియాలో ఇంకా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇక్కడ మాత్రమే కాదు పలు విదేశాల్లో కూడా ట్రెండ్ అవుతుండటం విశేషం. దాదాపు 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండ్ అవుతుంది. మరి దీన్ని బట్టి పుష్ప క్రేజ్ విదేశాల్లో కూడా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.