టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన తాజా చిత్రం ‘హనుమాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అయింది. బరిలో హేమాహేమీలు వంటి అగ్రహీరోల చిత్రాలున్నప్పటికీ అద్భుతమైన కంటెంట్‌తో సత్తా చాటింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ విడుదలైన ప్రతిచోటా అదిరిపోయే కలెక్షన్స్‌తో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించి, ఆపై 4వ రోజునే 100 కోట్ల మైలురాయి చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగుతో పాటు హిందీలోనూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ నిర్మాతకు కాసుల పంట పండిస్తోంది. మరికొన్నిరోజులు ఈ సినిమా హవా ఇలాగే కొనసాగితే వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల మార్కును అవలీలగా దాటుతుందని, అన్నీ అనుకూలిస్తే రూ.200 కోట్ల క్లబ్‌లోనూ చేరుకునే అవకాశాలను కొట్టిపారేయలేమనీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ‘హనుమాన్’ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్స్ కె. రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ రివ్యూ ఇవ్వగా.. తాజాగా మరో సెలబ్రిటీ ఈ లిస్టులో చేరారు.
Lord Hanuman is known for Doing the Unthinkable & the film #Hanuman has followed suit.. Hastoff to your vision , belief & conviction @PrasanthVarma
Kudos to your passion for cinema sir @Niran_Reddy
Great job & selection of films buddy @tejasajja123
Congratulations… pic.twitter.com/cJkhretJvz
— RAm POthineni (@ramsayz) January 16, 2024
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని ‘హనుమాన్’ మూవీ గురించి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో స్పెషల్ పోస్ట్ చేసిన ఆయన, తన అభిప్రాయాలను పంచుకున్నారు. అందులో ఆయన ఇలా తెలిపారు.. “అసాధ్యమైనవాటిని సాధించడంలో హనుమంతుడికి ఎవరూ సాటిరాలేరు. ఇప్పుడు హనుమాన్ సినిమాతో మీరు మరోసారి అలాంటిదానిని సాధించి చూపించారు. దీనికి మూలకారకులైన దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు నిర్మాత నిరంజన్ రెడ్డి.. ఇరువురికీ సినిమా పట్ల గల అభిరుచికి అభినందనలు. డియర్ ఫ్రెండ్ తేజ సజ్జా, ఈ సినిమాను ఎంచుకుని గొప్ప పని చేసావు. ఈ సినిమాలో నటించిన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, గౌరహరి మరియు అనుదీప్ దేవ్.. మీ అద్భుతమైన సహకారం ఈ చిత్రం ఘనవిజయానికి తోడ్పడింది! అందరికీ అభినందనలు” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: