ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ . హనుమంతుడి స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఎంత ప్రభంజన సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారివరకూ అందరూ ఈసినిమా కోసం బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజ సజ్జా నటన ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ అలానే ఓవర్సీస్ లో కూడా ఇలా ఎక్కడ చూసినా కూడా ఈసినిమా తన సత్తా చాటుతుంది. నార్త్ అమెరికాలో అప్పుడే 3 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈసినిమా వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది. కేవలం 4 నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం అంటే మాములు విషయం కాదు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
small film – BIG JUSTICE from the audience ❤️
The Humongous Roar of #HANUMAN Resounded at the Box-Office 💪
1️⃣0️⃣0️⃣ 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 4 days ᴡɪᴛʜ ʟɪᴍɪᴛᴇᴅ ꜱᴄʀᴇᴇɴꜱ & ᴍɪɴɪᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 💥#HanuManCreatesHistory
— Primeshow Entertainment (@Primeshowtweets) January 16, 2024
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈసినిమాకు సంగీతం.. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, సినిమాటోగ్రఫీ: శివేంద్ర అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: