హనుమాన్ రివ్యూ..గూజ్ బంప్స్ తెప్పించే విజువల్ వండర్

teja sajja hanuman movie telugu review

హనుమాన్ రివ్యూప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించాడు ప్రశాంత్ వర్మ. ఇక అప్ డేట్లతోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య తదితరులు
దర్శకత్వం.. ప్రశాంత్ వర్మ
బ్యానర్స్.. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌
నిర్మాతలు.. కె.నిరంజన్ రెడ్డి
సంగీతం.. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: శివేంద్ర

కథ
హన్మంతు (తేజ సజ్జా) తన అక్క అంజమ్మ తో కలిసి అంజనాద్రి ఊరిలో జీవిస్తుంటాడు. ఇక అదే ఊరిలో పాలెగాడు గజపతి (రాజ్‍దీపక్ శెట్టి) అక్కడి ప్రజలను ఇబ్బందిపెడుతూ అజమాయిషి చేస్తుంటాడు.
అంజనాద్రిలోనే మీనాక్షి (అమృతా అయ్యర్) అంటే హన్మంతుకి చిన్నప్పటి నుండీ ఇష్టం. అయితే ఆ విషయం మాత్రం బయటకు చెప్పడు. ఈ క్రమంలో మెడిసిన్ పూర్తి చేసుకొని ఊరికి వచ్చిన మీనాక్షి పాలెగాళ్ల అరాచకాలను ప్రశ్నిస్తుంది. దీంతో మీనాక్షిని చంపాలని చూస్తారు. ఇక మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హన్మంతు నదిలో పడిపోతాడు. అప్పటి నుంచే హన్మంతుకు సూపర్ పవర్స్ వస్తాయి. మరోవైపు మైఖేల్ (వినయ్ రాయ్) చిన్నతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలలు కంటూ ఉంటాడు. ఈనేపథ్యంలో అంజనాద్రి లోని పవర్స్ గురించి తెలుసుకొని అక్కడికి వస్తాడు. మరి హన్మంతుకు పవర్స్ ఎక్కడినుండి వచ్చాయి..?హన్మంతు దగ్గరున్న సూపర్ పవర్‌ను మైఖేల్ దక్కించుకోవడానికి ఏం చేశాడు? అంజనాద్రిని ఎలా రక్షించుకున్నాడు? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ

ఏదైనా కొత్తగా, డిఫరెంట్ గా ట్రై చేసే డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు. అలా చేసిన ప్రయోగమే ఈ హనుమాన్ కూడా. నిజానికి హాలీవుడ్ సినిమాల ద్వారానే మనకు సూపర్ హీరోస్ పరిచయం. ఇప్పటివరకూ ఎంతోమంది సూపర్ హీరోస్ సినిమాలను కూడా చూసుంటాం. అలాంటి జోనర్ ను ఇక్కడికి ఫస్ట్ టైం తీసుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరోస్ అంటే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఒక సామాన్య మానవుడికి అతీంద్ర శక్తులు వస్తే ఎలా ఉంటుంది అనేదే. అదే కాన్సెప్ట్ ను తీసుకొని దానికి ఒక సాలిడ్ కథను రాసుకొని హనుమాన్ తీసాడు.

మరి కథను ఎంత పర్ఫెక్ట్ గా రాసుకున్న దానిని అంతే పర్ఫెక్ట్ గా చూపించగలగాలి. లేకపోతేే పొగడ్తల విషయం పక్కనే పెడితే ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాలే ఈమధ్య కాలంలోనే చూశాం. అందులోనూ దేవుడు అనే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆశ్చర్యపరిచే విన్యాసాలతో పాటు మంచి విజువల్స్, వినోదం ఉండాలి. వీటన్నింటినీ పేపర్‌పై చక్కగా రాసుకున్న ప్రశాంత్.. తెరపై కూడా పర్‌ఫెక్ట్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక సినిమా స్టార్టింగే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంజనాద్రి ప్రాంతాన్ని పరిచయం చేశాక కథనం కాసేపు సాధారణంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా కామెడీ గా నడిచిపోతుంది. ఇంటర్వెల్ నుండి అసలైన కథ మొదలవుతుంది. పాత్రకు ఎప్పుడైతే సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయో అప్పటినుండీ వేరే మోడ్ లోకి వెళ్లిపోతుంది. సెకండాఫ్ మొత్తం ఫుల్ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఎలివేషన్ల సీన్లను లెక్కపెట్టలేం. ప్రతీ సీన్ ఎలివేషన్‌లా ఉంటుంది. విలన్లు కాల్చే బుల్లెట్లతో రాముడి రూపం..పెద్ద బండరాయిని హనుమంతు మోసే సీక్వెన్స్ ఇలా ప్రశాంత్ వర్మ చాలా ఎలివేషన్లు ఇచ్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంతో పాటు ఆశ్చరపరిచారు.

విశ్లేషణ

ఈసినిమాకు కూడా ప్రశాంత్ వర్మ తేజా సజ్జానే తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో అనే విషయం సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని వందకి రెండు వందల పర్సెంట్ న్యాయం చేశాడు. హన్మంతు పాత్రలో తేజా తప్పా మరొకరిని ఇక ఊహించుకోలేం. తేజ సైతం తెరపై సూపర్ హీరోలానే కనిపిస్తాడు. ఇక హన్మంతు అక్క పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ కు కూడా మంచి పాత్రే దక్కింది. హీరోయిన్ గా నటించిన అమృతా అయ్యర్ తన పాత్ర మేర బాగానే చేసింది. సముద్రఖణి పాత్రలోని సస్పెన్స్ తెరపై చూస్తేనే బాగుంటుంది. వినయ్ రాయ్ తన విలనిజాన్ని మరోసారి చూపించాడు. గెటప్ శ్రీను, సత్య, రోహిణి, వెన్నెల కిషోర్‌కు తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఈసినిమా సక్సెస్ కు ప్రధాన కారణాల్లో టెక్నికల్ వాల్యూస్ కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. నిజానికి ఈసినిమాకు పెట్టిన బడ్జెట్ కు ఈసినిమాకు అందించిన విఎఫ్ఎక్స్ ను చూస్తే వావ్ అనిపించక తప్పదు. పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ లో వంకలు పెట్టే రోజులు.. అలాంటిది ప్రశాంత్ వర్మ సాలిడ్ విఎఫ్ఎక్స్ ను అందించాడు. ఇక సంగీతం మరో హైలెట్.. ఈసినిమా ఈ రేంజ్ లో ఇంత ఎలివేట్ అవ్వడానికి మ్యూజిక్ ఒక కారణమని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫి మరో ప్రధాన బలం.. ప్రతి సీన్ కూడా స్క్రీన్ పై చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాను చూస్తేనే అర్థమవుతుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఓ పర్ఫెక్ట్ సినిమాతో వచ్చాడు ప్రశాంత్ వర్మ. చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అసలే పండగ.. ఎలాగూ సెలవులే కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూడొచ్చు. ఒక మంచి ఫీలింగ్‍తో ప్రేక్షకులను బయటికి రావడం ఖాయం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + thirteen =