గుంటూరు కారం రివ్యూ : మహేష్ మాస్ జాతర

guntur kaaram movie telugu review

నటీనటులు : మహేష్ బాబు, శ్రీ లీల,మీనాక్షి చౌదరి ,రమ్యకృష్ణ
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
సంగీతం : తమన్
దర్శకత్వం : త్రివిక్రమ్
నిర్మాత :రాధాకృష్ణ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు ,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ స్థాయిలో వుంటాయో చెప్పనక్కర్లేదు. కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే గతంలో వీరి కాంబో లో వచ్చిన అతడు,ఖలేజా ఓ మార్క్ ను సెట్ చేశాయి.ఇక ఇప్పుడు వీరిద్దరూ మూడో సినిమాతో వచ్చారు అదే గుంటూరు కారం.సంక్రాంతిని టార్గెట్ చేసుకొని చేసిన ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి గుంటూరు కారం ఎలావుందీ ?ఘాటు చూపించిందా లేదో ఇప్పుడు చూద్దాం.

కథ : 
రమణను (మహేష్ బాబు ),తన తల్లి వసుంధర( రమ్యకృష్ణ ) చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతుంది దాంతో రమణ ఎవడికి భయపడకుండా గుంటూరు లో మాస్ గా పెరుగుతాడు. తన తండ్రి రాయల్ సత్యం (జయ రామ్) మాత్రం చాలా సాఫ్ట్.అయితే కొన్ని పరిస్థుల వల్ల రమణకు చాలా ఏళ్ళ తరువాత తన తల్లి వసుంధర  నుండి పిలుపు వస్తుంది దాంతో ఎంతో ఆశతో వసుంధర దగ్గరికి వెళ్తాడు రమణ.ఆతరువాత ఏం జరిగింది.ఇంతకీ  రమణను తన తల్లి మళ్ళీ ఎందుకు పిలవాల్సివస్తుంది.అసలు వసుంధర, రమణ ను చిన్నపుడు ఎందుకు వదిలేయాల్సి వస్తుంది ? మధ్యలో రమణ ,శ్రీ లీల తో ఎలా ప్రేమలో పడతాడు అనేదే మిగితా కథ.

విశ్లేషణ : 

కథా పరంగా చూస్తే చాలా సింపుల్. ఇంతకుముందు ఇలాంటి పాయింట్ లతో స్టోరీలు రాసుకొని సూపర్ హిట్లు కొట్టాడు త్రివిక్రమ్.అత్తారింటికి దారేది ,అ ఆ, సన్ అఫ్ సత్యమూర్తి,అలా వైకుంఠపురములో ఈకోవలోకి చెందినవే.ఈ సినిమాల్లో ఎమోషన్స్ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యాయి.ఇక ఇప్పుడు గుంటూరు కారంను కూడా  అదే టెంప్లెట్ తో తీసుకొచ్చాడు.కాకపోతే ఈసినిమాలో త్రివిక్రమ్ తన రైటింగ్ కంటే ఎక్కువగా మహేష్ ను నమ్మాడు.త్రివిక్రమ్ పక్కా కమర్షియల్ సినిమాను తీయాలనుకున్నాడు దానికి మహేష్ మాములు సపోర్ట్ ఇవ్వలేదు.

ఫస్ట్ హాఫ్ లో సింపుల్ గా ఎంట్రీ ఇస్తాడు మహేష్. ఆతరువాత 20నిమిషాలు కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. మధ్యలో ఫైట్స్ తో తొలి సంగం డీసెంట్ అనిపిస్తుంది.సెకండ్ హాఫ్ లో అసలు కథ రివీల్ అవుతుంది. ఎమోషన్స్ బాగా పండాయి.కుర్చీ మడతబెట్టి సాంగ్ కు థియేటర్లు షేక్ అవుతాయి.మహేష్ ,శ్రీ లీల డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ కిక్ ఇస్తాయి.ఇక చివర్లో తన మార్క్ సీన్స్ తో త్రివిక్రమ్ వావ్ అనిపించాడు.ఓవరాల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే గుంటూరు కారం పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజి సినిమా.

నటీనటుల విషయానికి వస్తే మహేష్ వన్ మ్యాన్ షో చేశాడు.తనను ఇలా చూడడం ఫ్యాన్స్ కు నచ్చుతుంది.ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎనర్జిటిక్ గా కనబడుతూ యాక్టింగ్ తో అదరగొట్టాడు.సప్రైజ్ ఏంటంటే మహేష్ డ్యాన్స్.శ్రీ లీల తోపోటీ పడి డ్యాన్స్ ఇరగొట్టాడు.తన నుండి ఏంకావాలో అది  ఇచ్చాడు.అలాగే శ్రీలీల డ్యాన్స్ లతో అదరగొట్టడమే కాదు స్క్రీన్ ఫై చాలా గ్లామర్ గా కనిపించింది.తక్కువ సేపే కనిపించిన మీనాక్షి తన లుక్ తో ఆకట్టుకుంది.ఇక కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్,జయరాం ,రమ్యకృష్ణ తమ అనుభవాన్ని చూపించారు.

టెక్నీకల్ విషయానికి వస్తే  సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ క్వాలిటీ గా వున్నాయి.తమన్ సంగీతం అదుర్స్ అనిపించింది.ముఖ్యంగా కుర్చీ మడత బెట్టి సాంగ్ తెర మీద ఆదరిపోయింది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా వుంది.ఎడిటింగ్ ఓకే.హారిక హాసిని నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

ఓవరాల్ గా భారీ అంచానాల మధ్య వచ్చిన ఈ గుంటూరు కారంలో మహేష్ నటన ,డ్యాన్స్ హైలైట్ అయ్యాయి.మహేష్ ను ఇంత మాస్ గా ముందు ఏ సినిమాలో చూడలేదు.పండగకి పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే గుంటూరు కారం మిస్ అవ్వొద్దు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =