సలార్‌ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

Megastar Chiranjeevi Congratulates Prabhas and Salaar Team

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘సలార్’. ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఈ క్రమంలో తొలిభాగం ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డార్లింగ్‌ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వచ్చారంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్​లో ఉందో అర్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి సలార్ టీమ్‌కి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్ వేదికగా ప్రభాస్ మరియు సలార్ బృందాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి తన అభిప్రాయాలని వెల్లడించారు. అందులో..”మై డియర్ ‘దేవా’ ప్రభాస్ కంగ్రాట్యులేషన్స్. సలార్: సీజ్ ఫైర్.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ ఫైర్ అవుతోందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు అభినందనలు. మీరు ప్రపంచ నిర్మాణంలో నిజంగా రాణిస్తారు. మై లవ్ టు సూపర్బ్ ‘వరదరాజ మన్నార్’.. పృథ్వీరాజ్ సుకుమారన్, ‘ఆద్య’ శృతి హాసన్ మరియు ‘కర్త’ జగపతిబాబులకు అభినందనలు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అద్భుత సాంకేతిక నిపుణలు అందరికీ సూపర్ సక్సెస్ అందుకున్నందుకు నా అభినందలు” అని చిరంజీవి పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eighteen =