బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్- అతిథులుగా యంగ్ హీరోలు

young heroes to grace for bubble gum pre release event

నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈసినిమాకు మాత్రం మంచి పాజిటివ్ బజ్ యే వస్తుంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈసినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇప్పటికే వేదికను సైతం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుండి కార్యక్రమం జరగనుంది. ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరోలు అతిథులుగా రానున్నారు. అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ తో పాటు డైరెక్టర్ నందిని రెడ్డి విచ్చేయనున్నారు.

కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =