బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘యానిమల్’ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాగా వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌తోనే బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 1, 2023) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘యానిమల్’ ఇండియాలోనే కాకుండా యూఎస్‌లో సైతం అదరగొడుతోంది. ఈ సినిమాలో రణ్‍బీర్ కపూర్ విశ్వరూపం చూపించాడని, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. రణ్‍బీర్ యాక్టింగ్, సందీప్ టేకింగ్ కు యూఎస్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. దీంతో నార్త్ అమెరికాలో మొత్తం 2.5 మిలియన్ డాలర్లుకు పైగా కొల్లగొట్టింది. తద్వారా అక్కడ తొలిరోజు కలెక్షన్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన మొదటి హిందీ చిత్రంగా నిలిచింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అదరగొట్టిన ‘యానిమల్’… ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ.116 కోట్లు కలెక్ట్ చేసింది.
#Animal North America Gross $2.5 Million & Counting 🤘
Setting box office on fire🔥🔥🔥
Highest grossing Hindi film on Day 1
(including premieres) 🪓💥🇺🇸 Release by @NirvanaCinemas & @MokshaMovies#AnimalManiaBegins #AnimalTheFilm #AnimalMovie #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/kqqPPJcuIF
— BA Raju’s Team (@baraju_SuperHit) December 2, 2023
కాగా ‘యానిమల్’ సినిమాకు అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎడిటింగ్ చేయడం విశేషం. ఇక మొత్తంగా ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్, సినీ1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. ఈరోజు, రేపు వీకెండ్ కావడం.. పోటీగా మరే సినిమా బరిలో లేకపోవడం కూడా ‘యానిమల్’ మూవీకి కలిసొస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటోన్న నేపథ్యంలో మునుముందు మరిన్ని రికార్డులు బద్దలు కానున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: