యంగ్ హీరో నిఖిల్ మాత్రం విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కార్తికేయ2 సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఒక ఎపిక్ వార్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ భారీ వార్ ఎపిసోడ్ ను దాదాపు 12 రోజుల పాటు 8కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. మరి ఒక్క ఎపిసోడ్ కే 8 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఈసినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపటడ్లేదని అర్థమవుతుంది.
🔥 #Swayambhu Special Big Screen Experience Loading…
Shooting for some Crazy War Action Scenes.. More Surprises soon including One of the Worlds Best Technicians/FilmMaker joining the team 🔥@iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar… pic.twitter.com/fI0wKg4kcB— Nikhil Siddhartha (@actor_Nikhil) May 7, 2024
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























