‘యానిమల్’పై హీరో నాని స్పెషల్ రివ్యూ

Natural Star Nani Special Review on Ranbir Kapoor's Animal Movie

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా డిసెంబ‌ర్ 01న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలైన తొలి ఆట నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అని టాక్ తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ మూవీపై పలువురు సినీ సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని ‘యానిమల్’ సినిమాపై తన స్పందనను తెలియజేశాడు. ఈ మేరకు హీరో నాని ఎక్స్ లో ఇలా తెలిపారు.. ” ‘యానిమల్’ ఇండియన్ మూవీ కాదు, ఇంటర్నేషనల్ స్థాయి సినిమా. డైరెక్టర్ సందీప్ వంగా ఒక మ్యాడ్ జీనియస్. ఈ సినిమా హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్నల నటన అద్భుతం. ఇక ఇందులో పనిచేసిన నటీనటులు మరియు సిబ్బంది అందరికీ టేక్ ఏ బౌ’ అని పేర్కొన్నారు.

ఇక ముందుగా చెప్పిన‌ట్లుగానే డైరెక్టర్ సందీప్ వంగా, తన ట్రేడ్ మార్క్ టేకింగ్ తో అసలు సిసలైన వ‌యిలెన్స్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించాడు. దీంతో ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమే సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అదరగొట్టిన ‘యానిమల్’… ఫస్ట్ డే వ‌రల్డ్‌ వైడ్‌గా మొత్తం రూ.116 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. హిందీ బెల్ట్ పక్కన పెడితే, కేవలం సౌత్‌లోనే వంద‌ కోట్ల వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాతో రణబీర్‌ తన నటనా విశ్వరూపమే చూపించడానడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కాగా ‘యానిమల్’ సినిమాకు అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎడిటింగ్ చేయడం విశేషం. ఇక మొత్తంగా ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్, సినీ1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ప్రముఖ నిర్మాత దిల్‍ రాజు తెలుగులో విడుదల చేశారు. ఈరోజు, రేపు వీకెండ్ కావడం.. పోటీగా మరో సినిమా బరిలో లేకపోవడం కూడా ‘యానిమల్’ మూవీకి కలిసొస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటోన్న నేపథ్యంలో మునుముందు మరిన్ని రికార్డులు బద్దలు కానున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − ten =