మా ఊరి పొలిమేర-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍ ఎక్కడంటే?

Maa Oori Polimera 2 OTT Platform and Release Date Fixed

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం “మా ఊరి పొలిమేర-2′. డా. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ చిత్రానికి గ్యాని సంగీతం సమకూర్చగా .. ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. తొలి భాగానికి మించి హిట్ అయింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరికి ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ మేకర్స్ శుభవార్త వినిపించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ‘ఆహా’లో ఈ హర్రర్ జానర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు డిసెంబర్ 8వ తేదీన ‘మా ఊరి పొలిమేర-2’ స్ట్రీమింగ్‍ కానున్నట్లు ఆహా అధికారికంగా వెల్లడించింది. అయితే, ఆహా గోల్డ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రం 24 గంటల ముందుగానే అంటే డిసెంబర్ 7నే ఈ చిత్రాన్ని చూడొచ్చని కూడా వెల్లడించింది. సో.. ఈ సినిమాను థియేటర్లలో చూడనివారు మరో వారంలో ఎంచక్కా ఇంట్లోనే ఉండి వీక్షించే అవకాశం ఉంది. కాగా ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో జరుగుతుంది. ఇందులోని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయి.

ఇక బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర‌`(తొలి భాగం) నేరుగా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్ అయింది. హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సినిమా కొన్ని వారాల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో సత్యం రాజేష్‌ నటన చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అప్పటివరకు కమెడియన్‌గా నటించిన రాజేష్‌.. ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఓటీటీలో ఈ సినిమా సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకోవడంతో, మేకర్స్ వెంటనే సీక్వెల్‌ను చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఫస్ట్ పార్టుకు వచ్చిన ఆదరణతో.. సీక్వెల్‌ను థియేటర్‌లోనే రిలీజ్‌ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =