తెలుగునాట ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో అనేకమంది యువతీ, యువకులు బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్తి పలికి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఒక ఇంటివారవుతున్నారు. ఇటీవలే, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయడం తెలిసిందే. అలాగే సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ రెండవ కుమార్తె నిశ్చితార్థం కూడా ఈ మధ్యే విజయవాడలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అద్వైతా రెడ్డితో ఎంగేజ్‍మెంట్ జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. తొలుత ఆశిష్ అద్వైతకు రింగ్ తొడుగుగా.. అనంతరం ఆమె ఆశిష్ కి ఉంగరం తొడుగుతూ, ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయని సరదాగా ప్రశ్నించడంతో అక్కడ నవ్వులు పూశాయి. కాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని సమాచారం. ప్ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. దీని తర్వాత విశాల్ కాశీ దర్శకత్వంలో ‘సెల్ఫిష్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటించింది. ఇదే క్రమంలో ఆశిష్ హీరోగా మూడో చిత్రం తెరకెక్కుతోంది. గత కొన్ని రోజుల క్రితం మూవీ టీమ్ సమక్షంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాను ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ రూపొందిస్తుండగా.. హన్షిత రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: