బిగ్ బాస్ 7- పోటా పోటీగా సాగుతున్న టికెట్ టు ఫినాలే రేస్

bigg boss season 7 telugu day 88 highlights

బిగ్ బాస్7.. హౌస్ లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ నడుస్తుంది. మంగళవారం నుండి షురూ అయిన ఈ రేస్ లో మంగళవారం, బుధవారం పలు గేమ్స్ ను పెట్టాడు బిగ్ బాస్. రెండు రోజుల్లో ఐదు గేమ్స్ పెట్టగా శోభా, శివాజీ, ప్రియాంక్ రేస్ నుండి తప్పుకుంటారు. బుధవారం ఎపిసోడ్ ముగిసేసరికి ప్రశాంత్, యావర్, అర్జున్, అమర్, గౌతమ్ లు రేస్ లో ఉంటారు. మరోవైపు ప్రియాంక తన దగ్గర ఉన్న పాయింట్లను అమర్ కు ఇవ్వలేదని చాలా సేపు ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గురువారం ఎపిసోడ్ మొదలవుతుంది. మిగిలిన హౌస్ మేట్స్ కు పలు టాస్క్ లు ఇస్తాడు బిగ్ బాస్. ముందుగా వెరైటీ క్రికెట్ టాస్క్ ను ఇవ్వగా ఈ టాస్క్ లో అమర్ గెలుస్తాడు. ఆ తరువాత తప్పించుకో రాగా టాస్క్ ను ఇస్తాడు. ఈ టాస్క్ లో ఒక టన్నల్ లాగా ఉంటుంది. అది ఇసుకతో కప్పి ఉంటుంది. ఈనేపథ్యంలో ఆ ఇసుక తీసేసి దాని నుండి బయటకు వచ్చి కీ వెతికి వారి కాలికి ఉన్న తాళం ను తీయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ప్రశాంత్ గెలుస్తాడు. అయితే ఈ గేమ్ ఆడే క్రమంలో యావర్ తన తాళాన్ని తీసేయలేకపోతాడు. అయితే ఆ కోపంలో ఒక కీను విసిరెస్తాడు. దాంతో ఆ తరువాత గేమ్ లోకి వచ్చిన అర్జున్ కు తాళం దొరక్కపోవడంతో అర్జున్ కూడా గేమ్ లో ఫెయిల్ అవుతాడు. దాంతో అర్జున్ కీ పడేయకూడదు కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. రెండు గేమ్స్ అనంతరం తక్కువ స్కోర్ తో యావర్ రేస్ నుండి తప్పుకుంటాడు. అనంతరం యావర్ తన దగ్గర ఉన్న పాయింట్లను ప్రశాంత్ కు ఇస్తాడు.

ఆ తర్వాత పట్టుకో తెలుసుకో అనే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ లో కళ్లకు క్లాత్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చే ఐటమ్స్ ను చేతితో పట్టుకొని గెస్ చేయాల్సి ఉంటుంది. ఈఆటలో అమర్ గెలుస్తాడు. అయితే ఈ గేమ్ జరుగుతున్నప్పుడు యావర్ అమర్ కు కనిపిస్తుందని అంటాడు. దాంతో అమర్ కాస్త అసహనం వ్యక్తం చేస్తాడు. అనంతరం.. వదలకురా తడవకురా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో కూడా ప్రశాంత్ గెలుస్తాడు. ఈ గేమ్ ముగిసే సరికి తక్కువ పాయింట్లు ఉండటంతో గౌతమ్ టాస్క్ నుండి ఔట్ అవుతాడు. దీంతో గురువారం ఎపిసోడ్ ముగుస్తుంది.

మరి గౌతమ్ తన దగ్గర ఉన్న పాయింట్స్ ఎవరికి ఇస్తాడు.. ఫైనల్ పోటీ ఎవరి మధ్య ఉండబోతుందన్న విషయం తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − one =