సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. వయోలంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు రిలీజ్ అయిన పాటలు కానీ టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సందీప్ కథతో పాటు మేకింగ్, అలానే రణబీర్ యాక్టింగ్, ఇంకా బ్యాక్ గ్రౌండ్ కు మంచి అప్లాజ్ వస్తుంది. దీంతో ఈసినిమాతో సందీప్ మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అప్పుడే రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఈసినిమా యూఎస్ఏ లో మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఒక్క రోజులోనే ఈసినిమా 1.2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిపోయింది. హిందీ సినిమా చరిత్రలోనే ఫస్ట్ డే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టుకున్న మొదటి సినిమాగా ఈసినిమా కొత్త రికార్డు క్రియేట్ చేసుకుంది. మరి ముందు ముందు మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Highest ever North America premieres in the history of Hindi cinema
Box office on 🔥🔥🔥🔥#AnimalPremieres #AnimalTheFilm pic.twitter.com/kwYsjkwcD6
— Nirvana Cinemas (@NirvanaCinemas) December 1, 2023
కాగా ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ నిర్మించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమా అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























