బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. కాగా ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఇటివలే విడుదలైన ‘యానిమల్’ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్‍గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. మన ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ ఎలా వుంటుందో మనకి తెలుసు. కానీ ముంబై నుంచి ఎవరైనా వచ్చినపుడు మా ప్రేక్షకులు ఇలా వుంటారని చూపించాలని అనిపిస్తుంటుంది. ఇవాళ రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, భూషణ్ కుమార్ ఈ వేదికపై వున్నారు. వారికి మీ అందరి ప్రేమ, ఆదరణ చూపించడం చాలా ఆనందంగా వుంది” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రతి ఏడాది కొత్త దర్శకులు వస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు, విజయాలు అందుకుంటారు, చాలా పేరు సాధిస్తారు. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ప్రేక్షకులని ఇండస్ట్రీనే కాదు సినిమా ఫార్ములాని కూడా షేక్ చేసే దర్శకులు వస్తారు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. దాని తర్వాత ఈ ఫార్ములాని పక్కన పెట్టి సినిమా చేయగలనని నిరూపించిన దర్శకుడు సందీప్ వంగా. సందీప్‌ని చూస్తుంటే చాలా గర్వంగా వుంది. యానిమల్ టీజర్ వచ్చిన వెంటనే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలనిపించింది. రణ్‌బీర్ కపూర్ ఇంటెన్స్ యాక్టర్. బాలీవుడ్‌లో నా ఫేవరేట్ యాక్టర్ తను. తనలో చాలా ఇంటెన్సిటీ వుంటుంది. తన ప్రతిభ చూపించుకునే సినిమాలు చాలా తక్కువ పడ్డాయని నా అభిప్రాయం. యానిమల్‌తో రణ్‌బీర్ కపూర్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలోకి వెళ్తారని భావిస్తున్నాను. యానిమల్ కోసం టీం చాలా హార్డ్ వర్క్ చేసింది. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది. డిసెంబర్ 1న అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూడాలి” అని రాజమౌళి కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: