థ్రిల్లర్ నేపథ్యంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మంగళవారం రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చినా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.మౌత్ టాక్ బాగుండడంతో ఈసినిమా బాగానే హోల్డ్ చేయగలుగుతుంది.నిర్మాతలు చెప్పిన లెక్కల ప్రకారం 10రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 22.03కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 11కోట్లు.బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రెండు కోట్లు పైగా రాబట్టాల్సి వుంది. ఈరన్ తో ఈవారం కల్లా టార్గెట్ రీచ్ అవుతుంది కానీ యానిమల్ రూపంలో దెబ్బ పడే అవకాశాలు కూడా వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ శుక్రవారం యానిమల్ తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంది.హిందీ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే హైప్ వుంది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ను రాబట్టే ఛాన్స్ వుంది.మరి ఈసినిమాను తట్టుకొని మంగళవారం ఎంత వరకు హోల్డ్ చేయగలదో చూడాలి.
మంగళవారంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించగా నందితా శ్వేతా,అజయ్ ఘోష్,ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. ముద్రా మీడియా వర్క్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: