బిగ్ బాస్7- 13 వ వారం నామినేషన్స్ లిస్ట్

bigg boss season 7 telugu 13th week nominations list

బిగ్ బాస్ సీజన్ 7.. 12వారాలు పూర్తిచేసుకొని 13 వారంలోకి అడుగుపెట్టింది. ఇక 11వ వారం నో ఎలిమినేషన్ ఉండటంతో గత వారం డబల్ ఎలిమినేషన్ ను పెట్టారు. ఇక గత వారం అశ్విని, రతిక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇక వారిద్దరూ ఎలిమినేట్ అవ్వడంపై హౌస్ మేట్స్ చర్చలు జరుపుకుంటారు. దాంతో ఆదివారం ఎపిసోడ్ మొదలవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సోమవారం ఎపిసోడ్ అంటే అందరూ వెయిట్ చేసేది నామినేషన్ ప్రక్రియ కోసం. ఇక బిగ్ బాస్ కూడా లేట్ చేయకుండా నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టేశాడు. ఈ ప్రక్రియలో ఇంటిలో ఉండటానికి ఎవరు అనర్హులో ఇద్దరినీ నామినేట్ చేయాలి. ఇందులో భాగంగా ముందుగా వచ్చిన ప్రశాంత్.. ప్రియాంక, శోభా లను నామినేట్ చేశాడు. ప్రియాంకకు సీక్రెట్ టాస్క్ లో శోభా కు హెల్ప్ చేయడం నచ్చలేదని చెప్పాడు. ఇక శోభా కు ఒక బెడ్ షీట్ ను వాడుతున్నావన్న రీజన్ చెప్పాడు.

ఆ తరువాత ప్రియాంక శివాజీని, ప్రశాంత్ ను నామినేట్ చేసింది. మీరు నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారని..అబద్దాలు ఆడుతానని నాగ్ సార్ ముందు చెప్పారు అంటూ శివాజీకి రీజన్ చెప్పగా.. ప్రశాంత్ కు అందరితో కలవాలని అంటూ రీజన్ చెప్పింది.అనంతరం గౌతమ్.. ప్రియాంక,శివాజీని నామినేట్ చేశాడు. అర్జున్.. శివాజీని, ప్రియాంకను నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో మీరు చెప్పిన రీజన్ నచ్చలేదంటూ చెప్పాడు. ప్రియాంకకు సొంతంగా గేమ్ ఆడమని చెబుతాడు. ఆ తర్వాత వచ్చిన శివాజీ అర్జన్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేస్తూ నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసిన తరువాత నేను ఈ బ్యాండ్ ఉంచుకవడం కరెక్ట్ కాదంటూ చెబుతాడు. తరువాత గౌతమ్ ను నామినేట్ చేశాడు. ఆ తరువాత వచ్చిన అమర్ దీప్ ప్రశాంత్ ను గౌతమ్ ను నామినేట్ చేశాడు. ప్రశాంత్ కు బీబీ మ్యాన్షన్ హౌస్ లో అంత త్వరగా చనిపోవడం నచ్చలేదని తెలిపాడు. ఇంకా గౌతమ్ కు కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు సపోర్ట్ చేయలేదని అన్నాడు. ఆ తర్వాత యావర్.. గౌతమ్, ప్రియాంకను చివరిగా శోభా ప్రశాంత్, యావర్ లను నామినేట్ చేసింది.

ఫైనల్ గా ఈ వారం అమర్ కు ఎలాంటి నామినేషన్స్ పడకపోవడంతో నామినేషన్స్ లోకి రాలేదు. మిగిలిన హౌస్ మేట్స్ శివాజీ, యావర్, ప్రశాంత్, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభ అందరూ నామినేషన్ లోకి వచ్చారు. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 1 =