బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా ‘యానిమల్’ చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘యానిమల్’ డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేసిన మేకర్స్ తెలుగులోనూ చిత్ర ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ‘యానిమల్’ మూవీ టీమ్ టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పాల్గొంది. హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మరియు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తదితరులు అన్‌స్టాపబుల్ షోకి విచ్చేశారు. ఈ సందర్భంగా ‘ఆహా’ టీమ్ దీనికి సంబంధించిన ఇంట్రోను మేకర్స్ దీపావళి కానుకగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘బాలీవుడ్ మీట్స్ బాలయ్య’ అని ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
Animal X Lion 🔥
Bollywood Superstar #RanbirKapoor meets Natasimham #NandamuriBalakrishna to promote his film #Animal 🤩#NBK109 #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/duUdI8Laz8— Telugu FilmNagar (@telugufilmnagar) November 14, 2023
ఇక ఇప్పటికే రెండు సీజన్‌లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ‘అన్‌స్టాపబుల్’ షో లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మూడో సీజన్ ఈ మధ్యే ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదల సందర్భంగా.. ఆ మూవీ టీమ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో ఎపిసోడ్‌లో ‘యానిమల్’ టీమ్ పాల్గొంటోంది. అయితే రష్మిక మందన్న ఇంతకుముందు ఒకసారి బాలయ్య షోలో పాల్గొంది. అప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చింది. తాజా ఎపిసోడ్‌లో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా తొలిసారి ఈ షోలో కనిపించనునంఱు. కాగా బాలకృష్ణ, రణబీర్ కపూర్ ఇద్దరినీ ఒకే వేదికపై చూడనుండటం అభిమానులకు కన్నుల పండుగ కానుంది. ఇక త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: