బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.దీపావళికి థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.నిన్న కొన్ని చోట్ల సెలువు కూడా కావడం సినిమాకు బాగా కలిసొచ్చింది.మొదటి రోజు ఇండియాలో 43కోట్ల నెట్ ను రాబట్టిన ఈసినిమా రెండో 58కోట్లతో రెండు రోజుల్లోనే 101 కోట్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు కేవలం రెండు రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లో చేరిన 3వ హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో పఠాన్,జవాన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఓవరాల్ గా టైగర్ 3 ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 170కోట్ల కుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పట్లో హిందీలో పెద్ద సినిమాల విడుదలలేకపోవడంతో లాంగ్ రన్ లో 500కోట్లకు పైగా రాబట్టే ఛాన్స్ వుంది.
ఇక నార్త్ లో ఈసినిమా సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది కానీ సౌత్ లో మాత్రం నిరాశపరుస్తుంది.ఇంతకుముందు షారుక్ జవాన్ సౌత్ లో 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది కానీ టైగర్ 3 మాత్రం ఫుల్ రన్ లో 10కోట్లకు కూడా చేరుకునేలా లేదు.మనీష్ శర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.భారీ బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: