చంద్రమోహన్ మృతిపై.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఎమోషనల్ ట్వీట్స్

Megastar Chiranjeevi and Venkatesh Condolences To Actor Chandra Mohan's Demise

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా చంద్రమోహన్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపారు. అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్రమంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఎక్స్ లో సీనియర్ నటుడికి ఘన నివాళి అర్పించగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కూడా వారికి జత కలిశారు.

మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందిస్తూ.. “అనేక చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ సభ్యులకు , అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.” అని పేర్కొన్నారు. ఇక వెంకటేష్.. “చంద్రమోహన్‌గారి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులు మరియు ప్రియమైన వారు ధైర్యంగా ఉండాలని, అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అని వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.