బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లో సైతం కోట్లాది మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు ఆయన. ఇక షారుఖ్ అభిమానుల్లో సాధారణ ప్రేక్షకులే కాదు, పలువురు ప్రముఖులు కూడా ఉంటారంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియాలో దీపావళి పండుగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడివారితో సహా విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంలో దీపావళి వేడుకలు నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శుక్రవారం గ్రాండ్ గా జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పాల్గొని తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా భారత సంప్రదాయ వస్త్రధారణ కుర్తా పైజామా ధరించి స్టేజ్ పైకి ఎక్కినా ఆయన ఒక హిందీ పాటకు స్టెప్పులేశారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘దిల్ సే’ చిత్రంలోని ‘ఛయ్య.. ఛయ్యా’ పాటకు డ్యాన్స్ అదరగొట్టారు. ఎరిక్ గార్సెట్టితో పాటు మరికొందరు దౌత్య సిబ్బంది అడుగు కదిపడం విశేషం. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
I applaud the jovial spirit of US Ambassador to India, Mr. @ericgarcetti, for showing delightful interest in Diwali celebrations. Let there be light and happiness in the relationship of US and India like this forever!@USAmbIndia pic.twitter.com/8COlQ5EGlQ
— Satnam Singh Sandhu (@satnamsandhuchd) November 10, 2023
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘దిల్ సే’ చిత్రంలో షారుఖ్, మనీషా కొయిరాలా జంటగా నటించారు. ఇందులోని ‘ఛయ్య.. ఛయ్యా’ పాట అప్పట్లో ఉర్రుతలూగించింది. కదిలే ట్రైన్‌పై షారుఖ్ డాన్స్ చేయడం ప్రేక్షకులకు సర్ప్రైజింగ్గా అనిపించింది. 1998 ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా.. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఇటీవలే షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: