తెలుగు సినీ పరిశ్రమ ఈమధ్య కాలంలో ఎంతోమంది లెజెండరీ నటీనటులను కోల్పోయింది. గత ఏడాది అయితే సూపర్ స్టార్ కృష్ణ ను పొగొట్టుకుంది చిత్రపరిశ్రమ. కృష్ణ గారితో పాటు సత్యనారాయణ, చలపతిరావు లాంటి సీనియర్ నటులు సైతం మరణించారు. ఇక ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ ను కోల్పోయింది టాలీవుడ్. సీనియర్ నటుడు చంద్రమోహన్ నేడు తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా చంద్రమోహన్ వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందతూ మరణించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చంద్రమోహన్ మరణంపై సినీ ప్రముఖులు అందరూ స్పందిస్తూ తమ సంతాపం తెలియచేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ ను చేశారు. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.
— Jr NTR (@tarak9999) November 11, 2023
కాగా1966 లో రంగుల రాట్నం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు చంద్రమోహన్. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అప్పట్లో హీరోయిన్స్ కు చంద్రమోహన్ పక్కన చేస్తే స్టార్ హీరోయిన్స్ అవుతాం అనే సెంటిమెంట్ ఉండేది. కేవలం హీరోగా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూాడా తనకంటూ ప్రత్యేక గుర్తింప తెచ్చుకున్నాడు. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకూ రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: