రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ నుండి వస్తున్న సినిమా అవ్వడం.. అందులోనూ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించి అప్ డేట్ ను ఇప్పటికే ఇచ్చారు మేకర్స్. దీపావళికి ఈసినిమా నుండి జరగండి అంటూ వచ్చే ఫస్ట్ పాటను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా మ్యూజికల్ రైట్స్ ను ప్రముఖ సంస్థ సరిగమ లేబుల్ వారు సొంతం చేసుకున్నట్టు తెలిపారు. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఒక కలర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మరీ తెలిపింది. మరి చూడబోతే పాట మంచి కలర్ ఫుల్ గా ఉండేలా కనిపిస్తుంది.
Get ready for a musical explosion 💥 @saregamaglobal has secured the audio rights of Mega Powerstar @AlwaysRamCharan & @shankarshanmugh’s #GameChanger 🔥
Brace yourselves for the sensational soundtrack #Jaragandi coming out this Diwali! 🤩
A @MusicThaman musical… pic.twitter.com/MO40I7Q0MD
— Sri Venkateswara Creations (@SVC_official) November 7, 2023
కాగా కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోనుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: