‘హాయ్ నాన్న’ రిలీజ్ తర్వాత మృణాల్‌ని అందరూ ‘యశ్నా’ అని పిలుస్తారని చెప్పారు నేచురల్ స్టార్ నాని. ఆయన కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. తండ్రీ,కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బేబీ కైరా ఖన్నా నాని కూతురుగా చేస్తుండగా.. హీరోయిన్ యశ్న పాత్రలో ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ నటిస్తోంది. డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ ఇస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో మరియు ‘సమయమా’, ‘గాజు బొమ్మ’ అనే లిరికల్ వీడియో సాంగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా బిట్స్ ఫిలాని క్యాంపస్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా మూడో సింగిల్ ‘అమ్మాడి’ పాటని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. “ఈ ఆడిటోరియం నాకు చాలా స్పెషల్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో ఇక్కడికి వచ్చాను. వరుసగా ఎనిమిది సూపర్ హిట్లు నాన్ స్టాప్ గా కొట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈసారి పదహారు సూపర్ హిట్లు కొట్టకుండా బ్రేక్ తీసుకుంటే కరెక్ట్ కాదని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ నుంచి మా ప్రమోషనల్ కాంపెయిన్ స్టార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “హాయ్ నాన్నలో మీకు కావాల్సినంత ప్రేమ దొరుకుతుంది. థియేటర్ కి వెళ్లి మంచి ప్రేమకథ చూసి చాలా రోజులైయింది. ఇందులో మీకు టన్నులకొద్ది ప్రేమ దొరుకుతుంది. హాయ్ నాన్నలో గొప్ప మ్యాజిక్ వుంది. అది మీ అందరికీ నచ్చుతుంది. ‘సీతారామం’ తర్వాత మృణాల్‌ని అందరూ సీత అంటున్నారు. దీనికి మించిన పాత్ర ‘హాయ్ నాన్న’లో తను చేసిందని మా నమ్మకం. డిసెంబర్ 7 తర్వాత తన పేరు ‘యశ్నా’గా మారిపోతుంది. హాయ్ నాన్న 7న విడుదలౌతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి. హాయ్ నాన్న తప్పకుండా మీ అందరినీ గొప్పగా అలరిస్తుంది” అని పేర్కొన్నారు.
కాగా ఈ సినిమాకు సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. ప్రముఖ మలయాళ కంపోజర్, ‘ఖుషి’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ఇంతకుముందు నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలకు పనిచేయడం గమనార్హం. ఇక ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఇక ఈ చిత్రానికి ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పని చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో.. ‘హాయ్ నాన్న’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ‘హాయ్ నాన్నా’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: