మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దానికితోడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో పాటు పలువురు స్టార్ హీరోలు నటిస్తుండటంతో సినిమాకు ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే రీసెంట్ గా షూటింగ్ సమయంలో విష్ణు కు ప్రమాదం జరిగి స్వల్ప గాయాలయ్యాయి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండాగ ఇప్పుడు ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా కోసం అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ రంగంలోకి దిగారు. బాహుబలి, జవాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్టులకు ఫైట్స్ కంపోజ్ చేసిన కెచా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈసినిమా కు ఆయన పనిచేయనున్నారు.
కన్నప్ప కోసం ఆయన కంపోజ్ చేయబోయే సీక్వెన్సులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయని.. కెచా అద్భుతంగా కంపోజ్ చేస్తారని.. ప్రేక్షకులను పోరాట సన్నివేశాలు థ్రిల్ చేస్తాయని.. ప్రాచీన యుద్దాలను మళ్లీ తెరపైకి తీసుకురానున్నారని అంటున్నారు. థాయ్ లాండ్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి 80 మంది ఫైటర్లను కూడా కన్నప్ప సెట్స్ మీదకు తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. వారందరితో కెచా కంపోజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్టర్ పీస్‌లా ఉండబోతున్నాయట.
కాగా ఈసినిమాలో పెద్ద పెద్ద స్టార్లు అందరూ జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈసినిమాలో నటిస్తున్నారు. ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: