నందమూరి బాలకృష్ణ ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి.ఈదసరా సీజన్ లో థియేటర్లోకి వచ్చి విన్నర్ గా నిలిచింది.ఈసినిమా విడుదలై మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఇక ఈసినిమా ఎంత కలెక్ట్ చేసిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేట్రికల్ బిజినెస్ తో సహా ఎంత కలెక్ట్ చేసిందో చెప్పేశారు.భగవంత్ కేసరి 57.63కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా 18రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 70.01 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ విషయానికి వస్తే 131.19కోట్లు అని నిర్మాతలు పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ కలెక్షన్స్ ప్రకారం అయితే ఈసినిమా బయ్యర్ల కు మంచి లాభాలను తీసుకొచ్చినట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The festival continues at the cinemas with #BhagavanthKesari💥
From a ww theatrical business of 57.63cr To collecting a resounding share of 70.01CR and a Gross of 139.19CR worldwide 😎🔥#BlockbusterBhagavanthKesari is another remarkable film for everyone❤️🔥… pic.twitter.com/CAAOQjLEEy
— Shine Screens (@Shine_Screens) November 6, 2023
ఇక ఇలా నిర్మాతలే అన్ని లెక్కలను బయటపెట్టడం గమనార్హం.మరి వేరే నిర్మాతలు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తారో లేదో చూడాలి.యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భగవంత్ కేసరిలో కాజల్ హీరోయిన్ కాగా శ్రీ లీల కీలక పాత్రలో నటించింది.బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించాడు.తమన్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ నిర్మించింది.
ఇదిలావుంటే ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా 109 పై ఫోకస్ చేస్తున్నారు.వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.సాయి సౌజన్య,నాగవంశీ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: