రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో స్థానం

Ram Charan Joins Oscar Academy Actors Branch

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం లభించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన.. తాజాగా మరో ఘనత సాధించారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌’లో రామ్ చరణ్ స్థానం సంపాదించారు. ఈ మేరకు విషయాన్ని అకాడమీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ ‘యాక్టర్స్ బ్రాంచ్‌’లో చరణ్‌కు సభ్యత్వం అందిస్తున్నట్లు వెల్లడించింది. అకాడమీ నుంచి లేటెస్ట్‌గా విడుదలైన యాక్టర్స్ బ్రాంచ్ కొత్త లిస్టులో రామ్ చరణ్‌తోపాటు మరో 7 గురు నటులకు కూడా ఈ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో చోటు కల్పించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)

కాగా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీలోని యాక్టర్స్‌ బ్రాంచ్‌లో ఇప్పటికే టాలీవుడ్ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్‌ చరణ్‌కు ఆ అవకాశం దక్కింది. అయితే అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వానికి ఆహ్వానం అందుకోవాలంటే.. కొన్ని ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఒక నటి లేదా నటుడు తన జీవిత కాలంలో కనీసం మూడు థియేట్రికల్ ఫీచర్ ఫిల్మ్స్‌లో నటించి ఉండాలి. అలాగే ఆయా సినిమాల్లో ఒకటి గత ఐదు సంవత్సరాల్లోపుగా ఖచ్చితంగా విడుదలై ఉండాలి.. దీనితోపాటుగా ఆ చిత్రం ప్రధానంగా అకాడమీ సూచించిన విధంగా ఉన్నత ప్రమాణాలను కలిగి ఉండాలి. లేదా యాక్టింగ్ కేటగిరీ కింద అకాడమీ అవార్డుకు నామినేట్ అయి ఉండాలి. లేదా.. యాక్టర్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ ఆమోదించడం ద్వారా కానీ, ప్రత్యేక ప్రతిభతో గుర్తింపును పొంది కానీ, లేదంటే, చలన చిత్ర నటుడిగా అత్యుత్తమ సహకారాన్ని అందించడంలో కానీ కీలక పాత్ర పోషించి ఉండాలి.

ఈ విధంగా ఇన్ని అర్హతలు కలిగిన సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచిన నటీనటులకు మాత్రమే ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’లో చోటు కల్పిస్తారు. అలాంటి అరుదైన గుర్తింపునకు ఇప్పుడు రామ్ చరణ్‌ ఎంపిక కావడం విశేషం. ఈ విధంగా ఇన్ని అర్హతలు కలిగిన సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచిన నటీనటులకు మాత్రమే ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’లో చోటు కల్పిస్తారు. అలాంటి అరుదైన గుర్తింపునకు ఇప్పుడు రామ్ చరణ్‌ ఎంపిక కావడం విశేషం. మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. అతి కొద్దికాలంలోనే తనదైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గొప్ప విషయం. దీంతో తమ అభిమాన హీరో ఈ గౌరవాన్ని అందుకోవడంపై చెర్రీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చరణ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్; అనే మూవీలో నటిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ ఫీమేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే ప్రముఖ తమిళ నటుడు ఎస్‌జే సూర్య ఒక కీలక పాత్రలో కనిపించనుండగా.. నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక దీనితర్వాత చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో క్రీడా ప్రాధాన్యమున్న చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనుండటం విశేషం. కాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని అద్భుత నటనకుగానూ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటలో సహనటుడు జూ. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు గ్లోబల్ వైడ్‌గా సెన్సేషనే సృష్టించాయి. ఈ పాట ఒరిజినల్ బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇక తాజాగా తమ హీరోకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 14 =