లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను తెచ్చుకున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమా ఎప్పుడో 500 కోట్ల క్లబ్ లోకి వెళ్లిపోయింది. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు కొనుగోలు చేసి ఇక్కడ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంది. అయితే తెలుగులో కలెక్షన్స్ పై నిర్మాత నాగవంశీ కూడా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ ఈ సినిమా కలెక్షన్స్ గురించి చెబుతూ.. లియో సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాకు యువత బాగా కనెక్ట్ అయ్యారు..అయితే సెకండాఫ్ లో మాత్రం కొన్ని కంప్లయింట్స్ ఉన్నాయి.. ఓవరాల్ గా అయితే ఈసినిమా మంచి లాభాలనే అందించింది అని క్లారిటీ ఇచ్చాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: