జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలికాలంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాజకీయంగానూ పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన తన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఇటలీకి పయనమయ్యారు. కాగా పవన్ సోదరుడు నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరియు నటి లావణ్య త్రిపాఠిల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబంతో సహా ఇటలీకి బయలుదేరారు. ఈ క్రమంలో తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ వివాహ వేడుక కోసం వరుణ్ తేజ్, తన సోదరి నిహారిక కొణిదెల మరియు కాబోయే భార్య లావణ్య త్రిపాఠిలతో కలిసి శుక్రవారమే ఇటలీకి పయనమయ్యారు. వీరితో పాటు మరికొంతమంది మెగా కుటుంబ సభ్యులు అప్పుడే ఇటలీ చేరుకున్నారని, మిగతా వాళ్ళు కూడా ఈరోజు, రేపట్లో చేరుకుంటారని తెలిసింది. కాగా వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ సహా అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. ఇక ఇటలీలో వివాహ వేడుక తరువాత, నవంబర్ 5వ తేదీన తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన సంగతే. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఇప్పుడు ఇటలీలో వివాహం జరగబోతోంది.
#TFNExclusive: Power Star @PawanKalyan along with his wife get snapped at Hyd airport as they’re off to Italy to attend #VarunLav wedding ceremony!!📸🔥#PawanKalyan #OG #UstaadBhagatSingh #HHVM #TeluguFilmNagar pic.twitter.com/j6IQHdirnT
— Telugu FilmNagar (@telugufilmnagar) October 28, 2023
ఇక ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే, ఇటీవలే ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే మూవీలో నటిస్తున్నారు. భారతీయ వాయుసేనలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్‌గా నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సందీప్ ముద్దా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 8న ‘ఎయిర్ ఫోర్స్ డే’ సందర్భంగా విడుదల కానుంది. అలాగే ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే సినిమాను చేస్తున్నాడు వరుణ్ తేజ్.
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా అనేక సినిమాల్లో నటిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి సాలిడ్ హిట్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీనితోపాటు ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. దీనిపై కూడా పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకోవైపు క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. కాగా ఇది ఆయనకు తొలి పీరియాడికల్ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాల ద్వారా ఆయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే వీటితో పాటుగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: