వెంకటేష్ రెండో కుమార్తె ఎంగేజ్‌మెంట్.. హాజరైన చిరంజీవి, మహేష్ బాబు

Megastar Chiranjeevi and Mahesh Babu Attends Venkatesh's Daughter Engagement

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ఇంట శుభకార్యం జరిగింది. ఈ సీనియ‌ర్ హీరో ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. కాగా ఆయన రెండవ కుమార్తె నిశ్చితార్థం వేడుకను తాజాగా నిర్వహించారు. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ డాక్ట‌ర్ త‌న‌యుడితో వెంకీ రెండో కుమార్తె హ‌వ్య‌వాహిని వివాహం నిశ్చయమైంది. ఇక వచ్చే ఏడాది మార్చిలో వీరి వివాహం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల వారు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇక ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో మెగాస్టార్‌ చిరంజీవి మరియు సూపర్‌స్టార్‌ మ‌హేష్ బాబు దంపతులు ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలైన రానా, అక్కినేని నాగ‌చైత‌న్య‌ తదితరులు విచ్చేసి కూడా సంద‌డి చేశారు. వెంకటేష్, మహేష్ బాబు కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించడం తెలిసిందే. దీంతో వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక చిరంజీవితో ఆయనకు తొలినుంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురు హీరోలు వెంకటేష్ ఇంట్లో శుభకార్యానికి హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే వీరితో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరైనట్లు సమాచారం. కాగా వెంక‌టేష్‌, నీరజ దంప‌తుల‌కు మొత్తం ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఆశ్రిత, హ‌వ్య‌వాహిని, భావ‌న‌తో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు.

అయితే ఆశ్రిత వివాహం 2019లో వినాయ‌క్ రెడ్డితో జ‌రిగిన విషయం తెలిసిందే. చిన్న కుమార్తె భావ‌న‌ మరియు కుమారుడు అర్జున్ విదేశాల్లో చదువుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు అభిరామ్ వివాహం కూడా డిసెంబర్ మొదటి వారంలో శ్రీలంకలో జరగనుంది. సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా దగ్గుబాటి నటుడిగా కొనసాగుతుండగా.. ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన తన స్నేహితురాలు మిహికా బజాజ్ ను ఆయన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక దగ్గుబాటి వారి ఇంట రెండు పెళ్లిళ్లు జరుగనున్న నేపథ్యంలో ఆ ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నటుడు వెంకటేష్ తొలినుంచీ తన పర్సనల్ లైఫ్ విషయాలను ఎప్పుడూ, ఎక్కడా బహిర్గతం చేయలేదు. తన కుటుంబ సభ్యులు పూర్తి స్వేచ్ఛగా ఉండేందుకు ఇది అవసరమని ఆయన భావిస్తుంటారు. అందుకే ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి బయటి వ్యక్తులకు, ముఖ్యంగా మీడియాకు పెద్దగా తెలియదు. నిజానికి వెంకటేష్ మొదటి కుమార్తె ఆశ్రిత వివాహం కూడా మీడియాకు దూరంగా జరిగింది. దీని గురించి మీడియాలో ఎక్కువ ఫోటోలు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు రెండో కుమార్తె హవ్య వాహిని నిశ్చితార్థం విజయవాడలో జరిగింది. దీనిపై కూడా మీడియాకు అంతగా సమాచారం ఇవ్వలేదు.

అయితే ప్రస్తుతం ఈ నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, ఫొటోలు చూసి వెంకటేష్ అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీని గురించి కొంతమేరకు తెలిసింది. ఇక వెంక‌టేష్ ప్ర‌స్తుతం ‘సైంధ‌వ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే ‘సైంధ‌వ్’ మూవీ త‌ర్వాత వెంక‌టేష్.. యంగ్ డైరెక్టర్ త‌రుణ్ భాస్క‌ర్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.