రవితేజ, గోపీచంద్ మలినేని #RT4GM ప్రారంభం

Ravi Teja and Gopichand Malineni's RT4GM Movie Begins

మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని నాల్గవ సారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకా ఫ్లోర్‌లపైకి వెళ్ళకముందే ప్రతి అనౌన్స్ మెంట్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించనున్న #RT4GM భారీ స్థాయిలో రూపొందనుంది. ప్రముఖ తమిళ దర్శక, నటుడు సెల్వరాఘవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుండటం విశేషం. నటుడిగా మారిన ఫిల్మ్ మేకర్ సెల్వరాఘవన్ ఈ చిత్రం ద్వారా తొలిసారి తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నారు. అలాగే ఇంధూజ రవిచంద్రన్ ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇక #RT4GM వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనుందని, ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారని మూవీ యూనిట్ తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 26, 2023) టీమ్ సభ్యులు మరియు పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ని అందజేశారు. ముహూర్తం షాట్‌కు అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్‌ ఇచ్చారు. ఇక తొలి షాట్‌కి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. రవితేజతో థమన్‌కి ఇది 12వ చిత్రం కాగా, గోపీచంద్ మలినేనితో అతని 7వ చిత్రం, అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌తో 4వ చిత్రం.

బిగిల్, మెర్సల్, తాజా సంచలనం ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ చిత్రాలకు పని చేసిన అత్యంత ప్రతిభావంతుడైన సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. ఇంకా నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఈ మూవీకి ఎడిటర్‌గా.. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రముఖ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు.. మయూక్ ఆదిత్య, శ్రీనివాస్ గవిరెడ్డి, ఎం వివేక్ ఆనంద్, శ్రీకాంత్ నిమ్మగడ్డ తదితరులు రైటర్స్​గా సహకారం అందిస్తున్నారు. వీరితోపాటు మరికొంతమంది సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్ అండ్ టెక్నికల్ టీమ్ పని చేయనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియజేస్తారు. త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 16 =