ఓటీటీలోకి చంద్రముఖి 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Raghava Lawrence and Kangana Ranaut's Chandramukhi 2 Streaming on OTT

ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. గతంలో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ (తలైవర్) కల్ట్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ టైటిల్ రోల్‌ పోషించిన ఈ సినిమాలో వడివేలు, రావు రమేష్, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘చంద్రముఖి’ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి వాసుయే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఇక హీరో రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’ విడుదలకు ముందు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. తాను సినిమాల్లో గురువుగా భావించే రజినీకాంత్‌ను ఆయన నివాసానికి వెళ్లి ఆశీస్సులు కూడా తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదలైంది. కాగా రాఘవ లారెన్స్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవడం ఇదే ప్రథమం. అయితే హర్రర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘చంద్రముఖి 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు సదరు ప్లాట్‌ఫామ్ సంస్థ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. ‘చంద్రముఖి 2’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ట్లు తెలిపింది. సో.. ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించలేకపోయిన మూవీ లవర్స్ ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే దీనిని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 5 =